జయలలిత మేనకోడలికే వేద నిలయం.. మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయానికి సంబంధించి మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పును వెలువరించింది. వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. జయలిలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులేదని, మూడు వారాల్లోగా వేద నిలయాన్ని జయలలిత మేన కోడలు దీపకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
కాగా జయలలిత 2016లో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమని జయలలిత వారసులమని కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ఎలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం వేద నిలయం జయ మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరి దీనిపై ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో వున్న స్టాలిన్ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout