జయలలిత మరో బయోపిక్ వివరాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలిత జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో రెండు మాత్రం తెరకెక్కే క్రమంలో ఉన్నాయి.
అందులో ఒకటి ప్రియదర్శిని దర్శకత్వంలో రూపొందుతోన్న 'ది ఐరన్ లేడీ'. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా మరో బయోపిక్‌ను విష్ణు ఇందూరి నిర్మాణంలో ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. నిర్మాణంలో లైకా సంస్థ కూడా భాగమవుతుంది. స్క్రిప్ట్ సిద్ధమైందట.
ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయమేమంటే.. ఇందులో ఎం.జి.ఆర్ పాత్రకు అరవింద స్వామిని ఎంచుకోనున్నారట. సినిమాను జయలలిత జయంతి ఫిబ్రవరి 24న అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అమ్మా ఎండ్రాల్ అన్బు అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com