రేపు 'జయ జానకి నాయక' టీజర్ !!

  • IndiaGlitz, [Tuesday,July 11 2017]

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను రేపు (జూలై 12) ఉదయం 11.20 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ పోస్టర్ కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో.. టీజర్ అంతకుమించిన స్థాయిలో ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు!