జూలై 31న 'జయ జానకి నాయకి' ఆడియో విడుదల!!

  • IndiaGlitz, [Thursday,July 27 2017]

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించారు.

క్లాస్-మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన "జయ జానకి నాయక" ఆడియోను జూలై 31న అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించబడనుంది.

చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. "ఏ విషయంలోనూ రాజీపడకుండా "జయ జానకి నాయక" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇటీవల విడుదల చేసిన "నువ్వేలే నువ్వేలే" పాటకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. దేవి మళ్ళీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. జూలై 31న ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. ఆడియో విడుదల తర్వాత సినిమా మీద ఉన్న క్రేజ్ ద్విగుణీకృతమవుతుందన్న నమ్మకం ఉంది. విడుదల చేసిన టీజర్స్, పోస్టర్స్ ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకొంటుండడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!

More News

బాలీవుడ్ రీమేక్ లో ధనుష్...

తమిళ హీరో ధనుష్కు బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో ధనుష్ తమిళంలో రాంజాన్, షమితాబ్ చిత్రాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు ధనుష్కి బాలీవుడ్లో మంచి పేరునే తీసుకొచ్చాయి.

కమల్ రాజకీయ చిత్రం

యూనివర్సల్ స్టార్గా అభిమానులు పిలుచుకునే కమల్హాసన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో పెనుమార్పులే సంభవించాయి.కొందరు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటుంటే, మరికొందరేమో కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని అంటున్నారు.

'మా' ఆధ్వర్యంలో ఈనెల 30న 'యాంటీ డ్రగ్' వాక్..అతిధిగా ఎక్సైజ్ మంత్రి పద్మారావు

ఈనెల 30 తేదీన ఉదయం 7 గంటలకు కే.బి.ఆర్ పార్క్ లో `మా` ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా `యాంటీ డ్రగ్ వాక్` కు తలపెట్టింది.

జూలై 31న 'యుద్ధం శరణం' టీజర్ విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో

నాన్న, అక్కతో సినిమా చేస్తాను - అక్షర

కమల్ తనయలు శ్రుతిహాసన్,అక్షర హాసన్ ఇద్దరూ సినీ రంగంలోనే రాణిస్తున్నారు.