జవాన్ ప్రీ రిలీజ్ టూర్ వివరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే రిలీజ్ చేసిన పాటలకు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ ప్రమోషన్స్ నడుమ డిసెంబర్ 1న జవాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రమోషన్స్ లో భాగంలో జవాన్ చిత్ర యూనిట్ డైరెక్టుగా అభిమానుల్ని, ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ టూర్ లో హీరో హీరోయిన్ డైరెక్టర్ తో పాటు ఇతర చిత్ర యూనిట్ పాల్గొంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలౌతున్న జవాన్ టూర్ షెడ్యూల్ విషయానికి వస్తే...
28వ తేదీ మంగళవారం ఉదయం
ఉదయం 9:30 : ద్వారకా తిరుమల
ఉదయం 11:00 : మద్ది ఆంజనేయస్వామి టెంపుల్, జంగారెడ్డిగూడెం
మధ్యాహ్నం 1:30 : ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్షన్
సాయంత్రం 4.00 : విజయవాడ దుర్గమ్మ దర్శనం
సాయంత్రం 5.00 : విజయవాడ లో ప్రెస్ మీట్
భారీ అంచనాల మధ్య జవాన్ విడుదలౌతోంది. అంతే కాదు.. విడుదలకు ఒక రోజు ముందుగానే ఈ చిత్ర ప్రీమియర్ షోను హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లో ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్ షో చూసేందుకు సినీ సెలెబ్రిటీస్, మీడియా తో పాటు కొంతమంది అభిమానులకు కూడా అవకాశం కల్పించారు. సినిమా మీదున్న నమ్మకంతోనే ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com