మెగా హీరో మూవీ టైటిల్ జవాన్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ సక్సెస్ సాధించడంతో...తదుపరి చిత్రాలకు పక్కా ప్లాన్ రెడీ చేసాడు. తేజు నటించిన తదుపరి చిత్రం తిక్క. ఈ చిత్రాన్నిఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెరకెక్కించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తిక్క చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...సాయిధరమ్ తేజ్, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం తర్వాత సాయిధరమ్ హీరోగా బి.వి.ఎస్ రవి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సోల్జర్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి జవాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రం ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments