'జవాన్' మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జవాన్ టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. టీజర్ అంచనాల్ని మించి ఉండడంతో… అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జవాన్ టీజర్ లో మాస్ కమర్షియల్ అంశాల్ని మేళవించడంతో పాటు… కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత….. అంటూ… దర్శకుడు బివిఎస్ రవి చెప్పిన వాయిస్ ఓవర్ ఆలోచనాత్మకంగా… సందేశాత్మకంగా… ఉంది. సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. సాయి ధరమ్ ఇప్పటివరకు చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తయితే… జవాన్ లో చేసిన క్యారెక్టర్ మరో ఎత్తు. టీజర్లో తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి హైలైట్ గా కనిపిస్తోంది.
దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యమని దర్శకుడు బివిఎస్ రవి చెబుతున్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ కనిపిస్తున్నాడు. తన కుటుంబాన్ని మనోదైర్యంతో, బుద్దిబలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. సెప్టెంబర్ లో జవాన్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com