‘జాతిరత్నాలు’ అదరగొడుతున్న స్పెషల్ సాంగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా కాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి కడుపుబ్బ నవ్వుకున్నారంటే దానికి కారణం ‘జాతిరత్నాలు’. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎవరి నోట విన్నా ‘జాతిరత్నాలు’ టాకే. ‘కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్ ఎందుకు?’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. దీనికి ఈ సినిమా రివర్స్. నిజానికి ఈ సినిమాలో కంటెంట్ అయితే ఏమీ లేదు.. కేవలం కటౌట్ చూసి ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లారంతే.. ఆ తరువాత మౌత్ టాక్ సినిమాకు బీభత్సంగా లభించింది. అంతే సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
‘జాతిరత్నాలు’గా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాకు సంగీతం మరో హైలైట్. ఎవరి నోట విన్నా ఈ చిత్రంలోని పాటలే వినిపిస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ మరో స్టెప్ తీసుకుంది. తాజాగా ఈ సినిమాకి మరో పాటను యాడ్ చేసింది. సినిమాలో ఒక్కటే టైటిల్ సాంగ్ ఉంటుంది. కానీ ఈ సినిమా టైటిల్‌తోనే మరో సాంగ్‌ను పాడించి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ‘అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు..’అనే స్పెషల్ సాంగ్‌ని వైజయంతి నెట్‌వర్క్ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది.
రామ్ మిర్యాల పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సాంగ్ కూడా అద్భుతంగా ఉండటంతో నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్‌తో దూసుకుపోతోంది. ఈ పాటకు సంబంధించిన వీడియోలో సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ని పంచుకున్నారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com