అక్కడ మాత్రం మెప్పించలేకపోయిన ‘జాతిరత్నాలు’
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు పెద్ద మొత్తంలో కరోనా మహమ్మారిని మరిచి అంతా హాయిగా థియేటర్లకు వచ్చి చూసిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. మార్చి నెల మొత్తమ్మీద విడుదలైన సినిమాల్లో ఈ సినిమాయే ప్రేక్షకుల ఆదరణను విశేషంగా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ అద్భుత విజయాన్ని సాధించింది.
ఇదిలా ఉండగా ‘జాతిరత్నాలు’ చిత్రం ఈ నెల 11న ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో మాత్రం బోల్తా కొట్టింది. ఓటీటీలో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా.. అని ఎదురు చూసిన ప్రేక్షకులు సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆదరించలేకపోయారు. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసరికి నవ్వించలేకపోయింది. తమకు నచ్చలేదుంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఓటీటీలో సినిమా చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. చిత్రంలో 'కంటేంటే లేదు, ఓవర్ రేటెడ్ కామెడీ తప్పా' అని సినిమాను ఓటీటీలో చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఓటీటీలో సైతం ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సినిమాలో విషయమే లేదంటూ తేల్చేస్తున్నారు. థియేటర్లో జనం మధ్యన చూసిన సినిమాకు.. ఇంట్లో ఒకరిద్దరి మధ్య కూర్చొని చూసిన సినిమాకు తేడా ఉంటుందని ఈ సినిమా తేల్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com