'జత కలిసే' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు - అశ్విన్ బాబు, తేజస్వి, షకలక శంకర్, సప్తగిరి, విద్యుల్లేఖ రామన్, పృథ్వీ, ధన్ రాజ్, సూర్య, తదితరులు
సంగీతం - విక్కి,
కెమెరా - జగదీష్ చీకటి,
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - సాయికార్తీక్
నిర్మాత - నరేష్ రావూరి
సంస్థలు - వారాహి చలనచిత్రం, ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్, యుక్త క్రియేషన్స్
రచన-దర్శకత్వం - రాకేష్ శశి
కొన్ని సినిమాల పోస్టర్లను చూసి సినిమా మీద అంచనాలు పెంచుకోవచ్చు. అందులో నటించిన తారల గత సినిమాలు హిట్ అయితే ఈ సినిమాలపై అంచనాలు పెరగడం మామూలే. మరోవైపు సినిమాను చూసి నచ్చి అసోసియేట్ అయ్యే వారిని బట్టి కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో ఓ నిర్ణయానికి రావచ్చు. తాజాగా జతకలిసే విషయంలో ఇవన్నీ జరిగాయి. పోస్టర్లు బావున్నాయి. అశ్విన్ బాబు గత సినిమా రాజుగారిగది హిట్ అయింది. వారాహి చలనచిత్రం వంటి సంస్థ ఆ సినిమాతో కొలాబెరేట్ అయింది. సో ఈ సినిమా మీద అంచనాలు మామూలుగానే పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందో లేదో చదివేయండి.
కథ
రెండు భిన్న ధృవాలకు చెందిన వ్యక్తులు అమెరికాలో పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సిఇవో రిషి(అశ్విన్ బాబు), కలెక్టర్ కావాలనుకునే లక్ష్యంతో సాగిపోయే తేజస్వి అలియాస్ పింకీ(తేజస్వి) కలిసి చేసిన రోడ్ జర్నీయే ఈ చిత్రం. పింకీ స్నేహితురాలి పెళ్ళి, రిషి స్నేహితుడితో ఫిక్స్ అవుతుంది. అయితే తాగి గొడవ చేయడంతో పెళ్ళి అగిపోతుంది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో రిషి, పింకీ వైజాగ్ నుండి హైదరాబాద్ కు రోడ్ జర్నీ చేస్తారు. అయితే తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని మరచిపోలేని పింకీ రిషి, అతని స్నేహితులను పోలీసులతో కొట్టిస్తుంది. సోషల్ మీడియాలో అందరికీ చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తుంది. దాంతో రిషి తనను, తన స్నేహితులను ఎవరు ఇబ్బంది పెట్టారా అని తెలుసుకుంటాడు. అది పింకీయే అనే విషయం తెలుస్తుంది. అయితే అప్పటి రిషి పింకీని ప్రేమించడం మొదలు పెడతాడు. అప్పుడు రిషి ఏం చేస్తాడు? తన ప్రేమను తేజస్వికి చెబుతాడా? అసలు ఇద్దరు కలుస్తారా? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ
అశ్విన్ బాబు డ్యాన్సులు బాగానే చేశాడు కానీ ఎక్స్ ప్రెషన్స్ విషయంలో డెవలప్ కావాల్సి ఉంది. తేజస్వి తన పాత్ర పరంగా బాగానే చేసింది. ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన తేజస్వి ఇప్పుడు హీరోయిన్ గా చేయడం తనకు ఓ రకంగా ప్లస్ అవుతుంది. సూర్య, పృథ్వీ, స్నిగ్ధ, సప్తగిరి, షకలకశంకర్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాకేష్ శశి అనుకున్న పాయింట్ ను మంచి కథనం రూపంలో తెరపై ఆవిష్కరించలేదు. నటీనటుల్లో కనపడాల్సిన ఎమోషనల్ కంటెంట్ కనపడలేదు. సినిమా అంతా స్లోనెరేషన్ లో నే ఉంటుంది. సెకండాప్ మరి సాగదీసినట్టు ఉంటుంది. మధ్యలో ఓ ఫైట్, క్లయిమాక్స్ లో వచ్చే సాంగ్ సినిమా నిడివిని పెంచాయే కానీ ఏ మాత్రం సపోర్ట్ చేయలేకపోయాయి. విక్కి సంగీతం వినసొంపుగా లేదు. సాయికార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు సపోర్ట్ అయింది. గబ్బర్ సింగ్ గా షకలకశంకర్, శ్రీమంతుడుగా సప్తగిరి, విద్యుల్లేఖ రామన్ మధ్య నడిచే కామెడి ట్రాక్ పెద్దగా పండలేదు. మొత్తం మీద సినిమాను తీసి పారయలేం. అలాగని ఓకే కూడా చెప్పలేం.
బాటమ్ లైన్
జత కలిసే.. ప్రేక్షకుల మదిలో జత కలవలే...
రేటింగ్: 2.25/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments