డిసెంబర్ 13న 'జత కలిసే' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం జత కలిసే`. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రేపటి దర్శకులు' అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి సినిమాను గ్రాండ్ లెవల్లో డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.
విక్కి, సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 13న హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరితోపాటు రాజా చెయ్యివేస్తే టీమ్, మనమంతా టీమ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారాహి చలన చిత్రం సాయికొర్రపాటి సినిమాను విడుదల చేస్తుండటంత సినిమా రేంజ్ పెరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com