Japan:'జపాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో కార్తీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. టాలీవుడ్ హీరోల కంటే తెలుగు స్పష్టంగా మాట్లాడటంతో కార్తీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి, నా పేరు శివ, ఖైదీ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన 25వ చిత్రం ‘జపాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హైస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ‘జోకర్’ సినిమా ఫేమ్ రాజు మురుగన్ డైరెక్ట్ చేశారు. అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.
విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్‌లో కార్తీ డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయి. అయితే విడుదలైన తర్వాత థియేటర్స్‌లో నిరాశపరిచింది. అభిమానుల అంచనాలను ఆందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. డిసెంబర్ 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పేలని జపాన్.. బుల్లి తెరపై ఏమాత్రం ఆకట్టుంకుంటుందో చూడాలి.
ఇక కార్తీ కొత్త సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘వా వాథియారే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఖైదీ, సర్దార్ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కోసం తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments