'జనతాగ్యారేజ్ ' కు ఏడు మిలియన్స్ వ్యూవర్స్....
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు తర్వాత దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూడో చిత్రమిది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనపడుతున్నాడు. సమంత, నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
వచ్చే నెల మొదటివారంలో ఆడియో, సెప్టెంబర్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో ఈ సినిమా టీజర్‌కు అప్పుడు 5 మిలియన్ వ్యూవర్స్ దాటిపోయారు. అలాగే మలయాళంలో ఈ సినిమా టీజర్‌ను రెండు మిలియన్ వ్యూవర్స్‌ను వీక్షించారు. మొత్తం మీద ఈ సినిమా టీజర్‌ను ఏడు మిలియన్స్ వీక్షకులు వీక్షించారు. ఎన్టీఆర్ సినిమాల టీజర్స్ వ్యూస్‌లో ఈ చిత్రానిదొక కొత్త రికార్డు క్రియేట్ చేసిందని పరిశీలకులు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com