'జనతాగ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తాగ్యారేజ్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న మూడో చిత్ర‌మిది. చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ కీల‌క‌ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. స‌మంత‌, నిత్యామీన‌న్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదలను ముందు జూలై రెండో వారంలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నార‌ట‌. అయితే ఇప్పుడు ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని జూలై 25న చేయాలని యూనిట్ వర్గాలు అనుకుంటున్నాయట. అలాగే సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయాలనుకుంటున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొని ఉన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన ఫస్ట్ లుక్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.