Pawan Kalyan:సీఐపై చర్యలు తీసుకోండి .. అంజూ యాదవ్‌పై ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు, తిరుపతిలో భారీ ర్యాలీ
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కొద్దిరోజుల క్రితం జనసేన కార్యకర్త కొట్టే సాయిపై స్థానిక సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకోవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోనే తేల్చుకుంటానని చెప్పిన ఆయన.. అన్న మాట ప్రకారం సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీకి జనసేనాని ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ భారీ ర్యాలీగా ఎస్పీ ఆఫీసుకు చేరుకుని సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేసి ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
జనసేన నేతను చెంప దెబ్బకొట్టిన సీఐ అంజూ యాదవ్:
కాగా.. వాలంటరీ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు , వాలంటీర్లు దగ్థం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని పెళ్లిమండపం వద్ద బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన శ్రేణులు యత్నించాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు సీఎం దిష్టిబొమ్మను లాక్కొనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేత కొట్టే సాయిపై శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. అతని రెండు చెంపలపైనా కొట్టారు. అక్కడే వున్న జనసేన కార్యకర్తలు ఈ తతంగాన్ని వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తొలి నుంచి సీఐ తీరు వివాదాస్పదం:
అయితే సీఐ అంజూ యాదవ్ తీరు తొలి నుంచి వివాదాస్పదంగా వుంది. గతంలో నిర్దేశించిన సమయానికి హోటల్ మూయలేదంటూ ఓ మహిళపై అంజూ యాదవ్ చేయి చేసుకోవడంతో ఏకంగా జాతీయ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. తక్షణం సీఐపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై టీడీపీ నేత వంగలపూడి అనిత సైతం మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout