YS Jagan Again: 2024లో ఏపీలో గెలిచేది జగనే .. జన్మత్ సర్వేలో వెల్లడి, తెలంగాణలో నిజమైన అంచనా
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో మరికొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందన్న దానిపై ఎన్నో సంస్థలు సర్వేలను వెల్లడించాయి. ఏ సంస్థ చెప్పినా అది ఒకటే మాట.. అదే వైసీపీ విజయమని. గతంలో టైమ్స్ నౌ, పొలిటికల్ క్రిటిక్, పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని ప్రకటించాయి. తాజాగా జన్మత్ పోల్స్ సర్వేలోనూ వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తేలింది. వచ్చే ఎన్నికల్లో 116 నుంచి 118 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని పేర్కొంది. అన్ని సర్వేల్లాగే దీనిని తీసుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే.. ఈ సంస్థ చెప్పినట్లుగానే తెలంగాణలో ఫలితాలు వచ్చాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలు కూడా.. కాంగ్రెస్కు మెజారిటీ మార్కుకు దిగువన 60 లేదా 57 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేయగా.. మరికొన్ని మాత్రం బీఆర్ఎస్కు ఏకపక్షంగా విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ జన్మత్ సర్వే మాత్రం కాంగ్రెస్కు 61 నుంచి 63 సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ చెప్పినట్టే కాంగ్రెస్కు మరో సీటు అదనంగా 64 స్థానాలు దక్కి గ్రాండ్ ఓల్డ్ పార్టీ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టింది. బీఆర్ఎస్కు 45 నుంచి 47 వస్తాయని పేర్కొనగా 39 సీట్లకే పరిమితమైంది. బీజేపీకి 4-5 వస్తాయని చెప్పగా 8, ఎంఐఎంకు 6 నుంచి 7 స్థానాలని పేర్కొనగా.. తన పాత స్థానాలను నిలబెట్టుకుంటూ 7 చోట్ల విజయం సాధించింది. దీనిని బట్టి చూస్తే మరో మాట లేకుండా 2024లోనూ జగనే సీఎం అని చెప్పవచ్చు.
జన్మత్ పోల్స్ సర్వేలో వైయస్ఆర్సీపీకి 116 నుంచి 118 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ, జనసేన కూటమికి కేవలం 46 నుంచి 48 సీట్లు దక్కుతాయని తేల్చి చెప్పింది. దీనికి ముందు వెల్లడైన టైమ్స్ నౌ గ్రూప్-ఈటీజీ గ్రూప్ సర్వేల్లోనూ ఏపీలో 51 శాతం ప్రజలు వైయస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతారని తేలింది. టైమ్స్ నౌ-ఈటీజీ సంస్థలు దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో సర్వేలు చేసిన అనుభవం ఉంది. ఈ సంస్థలు వెల్లడించిన పలు సర్వేల అంచనాలకు తగ్గట్టే ఫలితాలు రావడంతో దేశ ప్రజల్లో ఓ విశ్వసనీయత, నమ్మకం వున్నాయి.
పొలిటికల్ క్రిటిక్ సర్వేస్ అండ్ అనాలసిస్ సంస్థ సర్వేలోనూ వైయస్సార్సీపీకి 135 వరకు స్థానాలు వస్తాయని చెబితే.. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో వైసీపీకి 48.5 శాతం, టీడీపీకి కేవలం 38.2 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. కరోనా లాంటి కష్ట సమయంలోనూ ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు జనంలోకి బాగా వెళ్లాయి. తాను చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారంతా తనను గెలిపిస్తారని జగన్ ముందు నుంచే చెబుతున్నారు. ఇప్పుడు ఈ సర్వే ఫలితాలను చూస్తుంటే.. ఆయన ముందు చూపును అర్ధం చేసుకోవచ్చు. మరి తాజా సర్వే నేపథ్యంలో టీడీపీ, జనసేన నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com