తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా.. తన డ్రీమ్ బయటపెట్టిన జాన్వీ
Send us your feedback to audioarticles@vaarta.com
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంటోంది. నటిగా వడివడిగా అడుగులు వేస్తోంది. గ్లామర్, నటన పరంగా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కొన్ని చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా జాన్వీ కపూర్ తన డ్రీం వెడ్డింగ్ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయట పెట్టింది. తన వివాహం తిరుపతిలోనే జరగాలని జాన్వీ కపూర్ అంటోంది. బహుశా అది తన తల్లి శ్రీదేవి కోరిక ఏమో. తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా అని.. సంగీత్, మెహందీ మాత్రం చెన్నైలో తన తల్లి శ్రీదేవి ఇంట్లో జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
సౌత్ ఇండియన్ స్టైల్ లో మూడు రోజుల్లో తన వివాహం పూర్తి కావాలనేది నా కోరిక. బ్యాచిలర్ పార్టీని కాప్రి ఐల్యాండ్ లో ప్రయివేట్ బోట్ లో నా ఫ్రెండ్స్ తో కలసి చేసుకోవాలని అనుకుంటున్నట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. కాబోయే వాడి విషయంలో పెద్దగా కోరికలు లేవని.. తెలివైన వాడు అయి ఉంటే చాలని జాన్వీ కపూర్ చెబుతోంది.
ప్రస్తుతం బాలీవుడ్ సెలెబ్రిటీలంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నారు. వారితో పోల్చుకుంటే జాన్వీ కపూర్ బాగా ఆలోచిస్తోందనే చెప్పొచ్చు. శ్రీదేవికి తిరుపతితో ప్రత్యేక అనుబంధం ఉంది. బాల్యంలో కొంతకాలం శ్రీదేవి తిరుపతిలో గడిపింది. ఇప్పటికీ తిరుపతిలో ఆమె బంధువులు ఉన్నారు.
ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ గా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఆమె గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2 లాంటి చిత్రాల్లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments