జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ రిలీజ్..

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

బ‌ల‌వంతుడు బ‌ల‌హీనుడ్ని భ‌య‌పెట్టి బ‌త‌క‌డం అన‌వాయితీ...బ‌ట్ ఫ‌ర్ ఏ ఛేంజ్..ఆ బ‌ల‌హీనుడి ప‌క్క‌న కూడా బ‌లం ఉంది. జ‌న‌తా గ్యారేజ్....ఇచ్చట‌ అన్నీ రిపేర్ చేయ‌బ‌డును అంటూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చెప్పిన‌ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్...ఈ మూవీ పై అంచ‌నాల‌ను మ‌రెంత పెంచేసింది. ఈ టీజ‌ర్ లో గ‌మ‌నించాల్సిన మ‌రో విష‌యం కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ మోహ‌న్ లాల్, ఎన్టీఆర్ ముస్లిమ్ గెట‌ప్ లో క‌నిపించారు. శ్రీమంతుడు లో మ‌హేష్ ఓ సాంగ్ లో ముస్లిమ్ గెట‌ప్ లో క‌నిపిస్తారు. బ‌ట్ ఫ‌రే ఏ ఛేంజ్ అనుకుంట ఎన్టీఆర్, మోహ‌న్ లాల్ ఇద్ద‌రూ ముస్లిమ్ గెట‌ప్ లో క‌నిపించారు. ఆగ‌ష్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతున్న జ‌న‌తా గ్యారేజ్ అంచ‌నాల‌ను అందుకుని ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.