జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ మారింది..!

  • IndiaGlitz, [Tuesday,August 23 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రంలో స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌రుచుకున్న జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని ఆగ‌ష్టు 12 రిలీజ్ చేయాల‌నుకున్నారు.
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కి కాస్త ఎక్కువ టైమ్ కావాలి అంటూ సెప్టెంబ‌ర్ 2 కి వాయిదా వేసారు. ఇక ఇప్పుడు మ‌రోసారి జ‌న‌తా గ్యారేజ్ రిలీజ్ డేట్ మారింది. అయితే...ఈసారి రిలీజ్ డేట్ ఒక‌రోజు ముందుకు వ‌చ్చింది. అవును..సెప్టెంబ‌ర్ 1న జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.