జనతా గ్యారేజ్ మలయాళ వెర్షెన్ ఆడియో రిలీజ్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం ఓ పాట చిత్రీకరిస్తున్నారు.
సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన జనతా గ్యారేజ్ ఆడియో ఇటీవల రిలీజైంది. ఇక జనతా గ్యారేజ్ మలయాళ వెర్షెన్ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఈ నెల 26న కొచ్చిన్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీజర్ & ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న జనతా గ్యారేజ్ చిత్రాన్ని సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com