70 కోట్ల క్ల‌బ్ లో జ‌న‌తా గ్యారేజ్..!

  • IndiaGlitz, [Monday,September 12 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఈనెల 1న రిలీజై రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఎన్టీఆర్ కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రంగా జ‌న‌తా గ్యారేజ్ నిల‌వ‌డం విశేషం.

ప‌ది రోజుల్లోనే జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌పంచ వ్యాప్తంగా 70 కోట్లు షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధిస్తుంది. ఇటీవ‌ల ఈ సినిమాలో రెండు సీన్స్ ను క‌ల‌ప‌డంతో క‌లెక్ష‌న్స్ పెరిగే అవ‌కాశం ఉంది అంటున్నారు సినీ పండితులు. మ‌రి...జ‌న‌తా గ్యారేజ్ ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేస్తుందో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూద్దాం..!