ఆలోచింప చేస్తున్న గ్యారేజ్ డైలాగ్స్

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ & ట్రైల‌ర్ లో రిలీజ్ చేసిన డైలాగ్స్ ఆలోచింప చేస్తూ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌తి డైలాగ్ లో కొర‌టాల మార్క్ క‌నిపిస్తుంది. ఈ భూమి అన్నా...ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం..! చెట్లు, మొక్క‌లు, గాలి, నీరు వాటిని కాపాడుకోవ‌డ‌మే నా ప‌ని కూడా.! ఆ చెట్టు అంతే ఎంత ప్రాణ‌మో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా..!

ఎక్క‌డో ఇంకో చోట పెద్ద మ‌నిషికి ఈ భూమి మీద ఉండే మ‌నుషులంటే ఇష్టం. ఆ సృష్టికే ఇద్ద‌రినీ కలిపితే బాగుంటుంది అనిపించింది..! ఆయ‌న ఒక అద్భుత‌మైన మాట చెప్పారు. మొక్క‌ల‌తో పాటు మ‌నుషుల‌ను కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుంది..! బ‌ల‌వంతుడు బ‌ల‌హీనుడ్ని భ‌య‌పెట్టి బ‌త‌క‌డం ఆన‌వాయితీ...బ‌ట్ ఫ‌రే ఛేంజ్ ఆ బ‌ల‌హీనుడి ప‌క్క‌న కూడా ఒక బ‌లం ఉంది జ‌న‌తా గ్యారేజ్..! అంటూ ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్స్ సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేస్తున్నాయి. టీజ‌ర్ & ట్రైల‌ర్ లోనే ఇలా ఉంటే...ఇక సినిమాలో ఇంకెన్ని అద్భుత‌మైన డైలాగ్స్ ఉన్నాయో..!