రోజుకో పోస్టర్ తో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నజనతా గ్యారేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించడంతో జనతా గ్యారేజ్ మ్యూజికల్ హిట్ గా నిలవడం ఖాయం అనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే...ఈ నెల 12న జనతా గ్యారేజ్ ఆడియోను సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో పై మరింత క్రేజ్ పెంచేలా రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తుండడం విశేషం. నిన్న ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ ముగ్గురు ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తే....ఈరోజు మోహన్ లాల్, ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేసారు. రేపు ఏ పోస్టర్ రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com