'జనతాగ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్....
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్`. సినిమా ప్రస్తుతం శరవేగంగా విడుదలకు సిద్ధమవుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు తర్వాత దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూడో చిత్రమిది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనపడుతున్నాడు. సమంత, నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నారు. అంత కంటే ముందు ఈ సినిమా ఆడియో విడుదలను ఆగస్ట్ 13న చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ ఆడియో వేడుకను హైదరాబాద్‌లో చేయాలా లేక మరెక్కడైనా చేయాలా అనే విషయంపై దర్శక నిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నారట. ఎందుకంటే ఈసారి ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరచకూడదనేది వారి ఆలోచనగా కనపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments