'జనతాగ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Sunday,July 24 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్'. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న మూడో చిత్ర‌మిది. ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ కీల‌క‌ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. స‌మంత‌, నిత్యామీన‌న్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమాను ఆగ‌స్ట్ 12న విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ కొన్ని అనివార్య కార‌ణాల‌తో సెప్టెంబర్ 2న విడుద‌ల చేస్తున్నారు. అంత కంటే ముందు ఈ సినిమా ఆడియో విడుద‌ల‌ను ఆగ‌స్ట్ 13న చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అయితే ఈ ఆడియో వేడుక‌ను హైద‌రాబాద్‌లో చేయాలా లేక మ‌రెక్క‌డైనా చేయాలా అనే విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ట‌. ఎందుకంటే ఈసారి ఎన్టీఆర్ అభిమానులను నిరాశ‌ప‌ర‌చ‌కూడ‌ద‌నేది వారి ఆలోచ‌న‌గా క‌న‌ప‌డుతుంది.

More News

తొలిరోజు నుండే 'కబాలి' రికార్డుల పర్వం షురూ....

సూపర్ స్టార్ రజనీకాంత్,పా రంజిత్ కాంబినేషన్ లో విడుదలైన కబాలి విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

హీరోయిన్ భర్తతో విడిపోనుందా..?

నాయక్,ఇద్దరమ్మాయిలతో,రీసెంట్ గా మేము సహా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను 2014లో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.

సిక్స్ ప్యాక్ లో కల్యాణ్ రామ్.....

సిక్స్ ప్యాక్ ట్రెండ్ టాలీవుడ్ లో నడుస్తూనే ఉంది.డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోలను మాస్ యాంగిల్లోనే కాకుండా లుక్ పరంగా కూడా కొత్తగా చూపించాలనుకుంటాడు.

విక్రమ్ ఇంకొక్కడు ఆడియోకు గెస్ట్ ఎవరో తెలుసా...

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్.

స్పీడు పెంచిన చైతు

అక్కినేని నాగ చైతన్య దోచెయ్ సినిమా రిలీజై సంవత్సరం దాటిపోయింది.