ఈనెల 12 న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రఖ్యాత మలయాళ నటుడు మోహన్ లాల్ ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను ఈ నెల 12న ఎంతో వైభవం గా శిల్ప కళా వేదిక లో నిర్వహించనున్నాం అని చిత్ర బృందం తెలిపింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఆడియో ను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ...ఈ చిత్రానికి అభిమానుల నుండి వస్తోన్న సపోర్ట్ మా టీం కి చాలా ఆనందాన్ని ఇస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం అని తెలిపారు.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ...మా బ్యానర్ లో రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నాం. భారీ తారాగణం తో, మంచి పవర్ ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని తెలిపారు.
సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్, ఫైట్స్ - ఆణల్ అరసు, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన - దర్శకత్వం - కొరటాల శివ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com