close
Choose your channels

జనతా గ్యారేజ్ ఆడియో వేడుక - వేదిక ఖరారు..

Friday, July 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు అనూహ్యమైన స్పంద‌న ల‌భిస్తుంది. ఈ టీజ‌ర్ మూవీ పై అంచ‌నాల‌ను మ‌రెంత పెంచేసింది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న‌ జ‌న‌తా గ్యారేజ్ ఆడియోను ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నారు. అయితే...ఈ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని న్యూజెర్సీలో చేయాల‌నుకున్నారు. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. ఈ భారీ క్రేజీ మూవీని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.