జనతా గ్యారేజ్ లో మార్పులు..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవల ముంబాయిలో షూటింగ్ చేసారు. ఈ షెడ్యూల్ లో మోహన్ లాల్, దేవయాని లపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. అయితే మోహన్ లాల్, దేవయాని లపై చిత్రీకరించిన సన్నివేశాల అవుట్ ఫుట్ డైరెక్టర్ కొరటాల శివకి సంతృప్తి కలిగించలేదట.
దీంతో దేవయాని పాత్రను సుహాసినితో చేయిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం సుహాసినితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. సుహాసిని ఓకే అంటే మళ్లీ మోహన్ లాల్, సుహాసిని లపై సీన్స్ చిత్రీకరించాలి. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటారు. మరి..దేవయాని పాత్రను సుహాసిని చేయబోతుంది అంటూ వస్తున్న వార్తలపై జనతా గ్యారేజ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com