'జనతా గ్యారేజ్' ఎటువైపు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ - కొరటాల శివ.. టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న క్రేజీ కాంబినేషన్ ఇది. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో' చిత్రాలతో తన కెరీర్‌లో కొత్త డైమన్షన్ తీసుకున్నాక ఎన్టీఆర్ చేస్తున్న సినిమా.. 'మిర్చి', 'శ్రీమంతుడు' చిత్రాలతో మాస్ సినిమాలకు క్లాస్ టచ్ ఇచ్చి మరీ రెండు ఘనవిజయాలను అందుకున్నాక డైరెక్టర్ కొరటాల చేస్తున్న సినిమా ఒకటే కావడంతో.. ఈ కాంబినేషన్‌పై క్రేజ్ పెరిగింది.
'జనతా గ్యారేజ్' కోసం చోటు చేసుకున్న ఈ క్రేజీనెస్ ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో హాట్ కేక్‌గా మారింది. రిలీజ్‌కి ముందే ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఇక విడుదలయ్యాక కొన్నవారికి, పంపిణీ చేసిన వారికి లాభాలు రావడమే తరువాయి. అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న 'జనతా గ్యారేజ్' ఆగస్టు 12న విడుదల కానుంది. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఇక్కడే ఓ మెలిక ఉంది.
అదేమిటంటే.. ఆగస్టు నెలలో ఎన్టీఆర్ హీరోగా ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి సూపర్ హిట్ కాగా.. మరొకటి సూపర్ ఫ్లాప్. ఆ సూపర్ హిట్ 2007 ఆగస్టులో వచ్చిన 'యమదొంగ' కాగా.. ఆ సూపర్ ఫ్లాప్ 2014 ఆగస్టులో వచ్చిన 'రభస'. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ఆగస్టులో వస్తున్న ఈ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' ఎటువైపు అడుగులేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments