జనతా గ్యారేజ్ ఫస్ట్ షెడ్యూల్ డీటైల్స్
Send us your feedback to audioarticles@vaarta.com
నాన్నకు ప్రేమతో...సినిమాతో విజయం సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి జనతా గ్యారేజ్ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించనున్నారు. దీని కోసం సారథి స్టూడియోలో 2.5 కోట్లుతో సెట్ వేసారు. ఈ సెట్ లో ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్ స్టార్ చేస్తున్నారు.
ఈ షెడ్యూల్ లో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆతర్వాత ఫిబ్రవరి నెలాఖరు నుంచి జరిగే సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, మోహన్ లాల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు ఫహద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com