'జనతా కర్ఫ్యూ' సందర్భంగా ఏపీలో బస్సులు బంద్
Send us your feedback to audioarticles@vaarta.com
మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. రేపు అనగా ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్వ్యూ ఉంటుందని.. ఉదయం 7గం నుంచి రాత్రి 9గం వరకూ ఎవరు కుడా బయటకి రాకూడదని సూచించిన విషయం విదితమే. కరోనా వైరస్ మొదటి ప్రపంచం యుద్ధాన్ని గుర్తు తెస్తోందని.. అంతకంటే ఇది ప్రమాదమని హెచ్చరించారు. అంతేకాదు శుక్రవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ కొన్ని సలహాలు, సూచనలు.. పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సీఎంల నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకోవడం జరిగింది.
బస్సులు బంద్!
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రైలు సర్వీసులు రద్దయ్యాయి. రేపు పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన విషయం విదితమే. అయితే తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా రేపు అనగా ఆదివారం నాడు ఏపీలో బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి. ఏపీలో దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులను రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో మొత్తం 11 వేల బస్సు సర్వీసులను నిలిపేయనున్నట్టు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
బయట తిరిగితే చెప్పండి!
కరోస్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనతా కర్ఫ్యూ నిర్ణయానికి మద్దతుగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు బస్సుల యజమాన్యాలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిని వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు ట్రావెల్స్, ఆటోలు ప్రజల వద్ద నుంచి అధిక వసూళ్లకు పాల్పడవద్దని నాని ఒకింత హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చినవారు 15 రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటించకుండా.. బయట తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com