వరుస ట్వీట్లతో టీడీపీ, వైసీపీని వణికిస్తున్న జనసేనాని!
- IndiaGlitz, [Friday,February 22 2019]
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... గత కొన్ని రోజులుగా వైసీపీ-జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాని అందుకే ఒకర్నోకరు విమర్శించుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ-జనసేన రహస్యంగా పొత్తు పెట్టుకున్నాయని జనసేనకు పాతిక సీట్లు,3 ఎంపీ సీట్లిచ్చేలా డీల్ కుదుర్చుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చేశారు.
జనసేనాని క్లారిటీ...
నేను వైసీపీ, బీజేపీతో కుమ్మక్కయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీనేమో నేను టీడీపీ పార్టనర్ అంటోంది. నేను రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ను కలిస్తే.. మళ్లీ టీడీపీ వాళ్లు వైసీపీ, కేసీఆర్‌తో ఉన్నానంటున్నారు. నువ్వు నిజంగా ప్రజల కోసం కష్టపడితే అన్ని వైపుల నుంచి ఇలాంటివి పడాల్సి ఉంటుంది అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదిగా చెప్పుకొచ్చారు.
ప్రజలు సిద్ధంగా ఉండాలి...
జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీ వాళ్లు రాసే వార్తలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయి. అలాంటి వాటి కోసం ప్రజలు సిద్ధంగా ఉండాలి. జనసేన ఒంటరిగా కాకుండా వెళ్లకుండా వారితో కలసి పోటీ చేయాలని ఆయా పార్టీలు ఆశిస్తున్నాయి. నేను ఎన్నికల్లో చిన్న పావునే కావొచ్చు. కానీ పోరాడడానికి సిద్ధంగా ఉన్న సైనికుడిని అని జనసేనాని స్పష్టం చేశారు.
టీడీపీ-వైసీపీ కుమ్మక్కు..!
జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయి. జనసేన పార్టీ ఇమేజ్ను దెబ్బకొట్టడానికి ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వార్తలు రాస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ సీనియర్ రాజకీయ పరిశీలకులు నాకు చెప్పారు. వారిని ఢీకొట్టడానికి జనసేనకు కూడా ఓ టీవీ, పేపర్ ఉంటే మంచిదని సూచించారు. నేను బహుజన సమాజ్ వాదీ పార్టీని ఏర్పాటు చేసిన కాన్షీరాం బాటలో నడిచే వాడిని. ఎలాంటి పత్రికలు, టీవీలు లేకుండానే కాన్షీరాం ప్రజల్లోకి వెళ్లారని చెప్పారు. నా జనసైనికులే నాకు న్యూస్ ఛానెల్స్.. వార్తాపత్రికలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు.
మొత్తానికి చూస్తే.. ఇప్పటికే పలుమార్లు ఈ పొత్తు విషయమై పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆయనపై వార్తలు మాత్రం ఆగలేదు. రోజురోజుకు కొత్త కొత్త కథనాలు పుట్టుకొస్తుండటంతో విసిగిపోయిన జనసేనాని ఇదిగో పైవిధంగా ట్వీట్స్ చేసి అటు టీడీపీ.. ఇటు వైసీపీలను వణికించడం ప్రారంభించారు. అయితే ఈ ట్వీట్స్‌పై పలువురు జనసేనానికి సపోర్టుగా నిలవగా మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.