జనసేనదే ప్రభుత్వం.. సీఎంగా ప్రమాణం చేస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
"2019లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. గురువారం విశాఖపట్నం జిల్లా గాజువాక శాసనసభ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గాజువాక లంక గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం నగరాన్ని కాలుష్య కోరల నుంచి, కబ్జా కోరల నుంచి, మాఫియా బారి నుంచి కాపాడుతామన్నారు.
మీకు జనసేన న్యాయం చేస్తుంది..!
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయ్యింది గానీ, భూములు ఇచ్చిన రైతులు మాత్రం వారి హక్కులు కోల్పోయారు. మీకు జనసేన పార్టీ న్యాయం చేస్తుంది. 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీలకి అండగా ఉన్నాం. మనకి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఓటేశాం. కానీ మన ఆశలు అడియాశలయ్యాయి. ఈ సారి మన ఓటు 25 కేజీల బియ్యం కోసమో, రెండు వేల నోటు కోసమో కాదని చాటుదాం. ఓటు కోసం నోటు ఇచ్చే వారి ముఖాన మీరే రెండు వేల నోటు తిరిగికొట్టే స్థాయి భవిష్యత్తు ఇచ్చేందుకు జనసేన పార్టీ ఉంది" అని పవన్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments