ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలుంటాయ్: జనసేన
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్ వాది పార్టీకి 25 ఏళ్లు పడితే.. జనసేన పార్టీ మాత్రం ఐదేళ్లలో సాధించబోతోందని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం తెలిపారు. రాష్ర్టంలో నిశ్శబ్ద విప్లవం ఉందని.. ఎవరూ ఊహించని విధంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయన్నారు. సోమవారం కాకినాడలో స్పందన ఫంక్షన్ హాల్లో కాకినాడ పార్లమెంటరీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన ముఖ్య నేతలు హాజరై పోలింగ్ సందర్భంగా అభ్యర్ధులకు ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "జన సైనికులు అంటే అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు కి ప్రాణం. మీరు వెనుక ఉన్నారన్న నమ్మకంతోనే మార్పు కోసం పోరాటం చేస్తున్నారు. సర్వేల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుంది.. ఈ పార్టీ విజయం సాధిస్తుంది అని చెబుతున్నారు. మాకు సర్వేలతో సంబంధం లేదు. మా పార్టీకి ప్రజాసేవే ముఖ్యం. రాజ్యాధికారం అందని అనేక కులాలు, వర్గాలను అందలం ఎక్కించాలని ఆయన కృషి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీకి గుండెకాయలాంటిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి గ్రామ గ్రామాన జనసేన జెండా రెపరెపలాడేలా కృషి చేయాలి. రాజకీయాల్లో కొంతమందికే అవకాశం వస్తుంది. అలా వచ్చిన వారు గొప్పవారు కాదు, రానివారు తక్కువ కాదు. జన సైనికులు, నాయకులు చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలి"అని ఆయన చెప్పుకొచ్చారు.
ఏ పార్టీలు కొట్టుకుపోతాయో..!
ఇదిలా ఉంటే.. సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారి తుపాన్‌గా ప్రతాపం చూపిస్తుందని.. అదేవిధంగా 2014లో జనసేన పార్టీ అల్పపీడనంగా ఏర్పడి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాయుగుండంగా మారి తుపాన్‌లా విరుచుకుపడిందని.. ఆ తుపాన్ తాకిడికి ఏ పార్టీలు కొట్టుకుపోతాయే తెలియని పరిస్థితి నెలకొందని పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments