జగన్ పాలనపై ‘జనసేన’ నివేదిక.. రియాక్షన్ ఉంటుందా!

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. శనివారం నాడు అమరావతి వేదికగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివేదిక విడుదల చేశారు. కాగా.. మొత్తం తొమ్మిది అంశాలపై నివేదిక విడుదల చేయడం జరిగింది. అయితే.. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని.. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని నివేదికలో తేల్చింది.

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీ సంక్షేమ పథకాలు జనరంజకం కానీ.. వైసీపీ 100రోజుల పాలన జన విరుద్ధంగా ఉందన్నారు. 151 సీట్లతో సంపూర్ణ మెజార్టీ సాధించిన వైసీపీని సమీప భవిష్యత్‌లో విమర్శించే అవకాశం ఉండదని భావించానని కానీ వైసీపీ 100రోజుల పాలన ప్రణాళిక లేకుండా సాగిందన్నారు. వైసీపీ విధాన నిర్ణయాలు ఇబ్బడిముబ్బడిగా జరిగాయని.. ప్రజలను ఆందోళనకు గురిచేసే నిర్ణయాలను జగన్ తీసుకున్నారన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడంలో సర్కార్ విఫలమైందన్నారు.

పవన్ ప్రసంగంలోని ముఖ్యంశాలు..

ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం
ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు
ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు.. ఇది పూడ్చుకోలేని నష్టం
ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది
వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే...రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు
టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి
వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు
ప్రకాశం జిల్లాకు రావాల్సిన ఓ పరిశ్రమ... మహారాష్ట్రకు తరలివెళ్లింది
రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు.. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి

వాలంటీర్లు అందుకే..!
వైసీపీ కార్యకర్తలను వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయడానికే గ్రామ వలంటీర్ల నియామకం.. వైసీపీ కార్యకర్తలనే గ్రామ వలంటీర్లుగా నియమించారు
టీడీపీని జన్మభూమి కమిటీలు ఎలా దెబ్బతీశాయో వైసీపీని గ్రామ వలంటీర్లు అలా దెబ్బతీస్తారు.
వైసీపీ ప్రభుత్వానికి విజన్‌ లేదు..

విచారణ జరగాల్సిందే..!
ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి: పవన్‌కల్యాణ్‌
పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి
పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది
కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు
ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు
వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు
వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది
రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు
కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు

మారిస్తే చూస్తూ ఊరుకోం!
రాజధానికి గతంలో ఇచ్చిన మద్దతును వైసీపీ నేతలు మరిచిపోయారు
రాజధాని అంటే 34వేల ఎకరాల భూమి కాదు
5 కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్‌
రాజధానిపై గత ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే... మీరివ్వండి
రాజధానిపై డోలాయమాన పరిస్థితి సృష్టించడం సరికాదు
రాజధానిని మార్చేస్తామంటే చూస్తూ ఊరుకోం
రైతులకు విత్తనాలు ఇవ్వడంలో వైసీపీ విఫలం
ఏపీలో పంచాల్సిన విత్తనాలు... మహారాష్ట్రలో తేలాయి
రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు

13 శాతం ఎలా పెరిగాయి!?
ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామంటున్నారు
ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గాలి కదా?
ఈ మూడు నెలల్లో బీర్ల అమ్మకం 13శాతం పెరిగాయి
వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధంపై నమ్మకంలేదు

కేంద్రాన్ని కోరతాం!
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి
కోడికత్తి కేసుపై గతంలో సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు
వివేకా హత్యకేసు ఇంతవరకు తేల్చలేదు
ఈ రెండు ఉదంతాలపై పోలీసుశాఖ దృష్టిసారించాలి.. లేదంటే సీబీఐ విచారణ జరపించాలని కేంద్రాన్ని కోరతాం

కాపు రిజర్వేషన్లపై..!
కాపు రిజర్వేషన్లు వైసీపీ సాధ్యం కాదన్నా ఎవరూ స్పందించలేదు
వైసీపీలో దూరిన కాపు నాయకులంటే జగన్‌కు భయం
నాయకులే బలహీనులైతే... హక్కులు సాధించుకోలేం: పవన్‌
151మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదాపై జగన్‌ నోరు మెదపడంలేదు
కిడ్నీ బాధితులకు రూ.1500 ఇస్తామని అమలు చేయడంలేదు
హెల్త్‌ పాలసీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
కృష్ణా జిల్లాలోనే ఎంతో మంది డెంగీ, విష జ్వరాల బారిన పడ్డారు
విశాఖలో మంచినీటి కొరతపై మంత్రి బొత్స దృష్టిపెట్టాలి అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సూచించారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.