Pawan Kalyan:ఈ నెల 9 నుంచి వారాహి విజయయాత్ర రెండో విడత .. ఏలూరులో పవన్ భారీ బహిరంగ సభ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. నేతలను, క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు తన బలం ఏంటో చూపించేందుకు ఆయన చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరిగిన సంగతి తెలిసిందే. కత్తిపూడి నుంచి భీమవరం వరకు జరిగిన ఈ యాత్రలో ఆయన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగారు. ఇదే సమయంలో అధికార వైసీపీపై వాడి వేడి విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సభలకు జనం వెల్లువలా తరలివచ్చారు. త్వరలో వారాహి విజయయాత్ర రెండో దశ మొదలవుతుందని భీమవరంలో పవన్ కల్యాణ్ స్ఫష్టం చేశారు.
ఏలూరు సభతో వారాహి యాత్ర ప్రారంభం :
ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో వారాహి విజయయాత్ర రెండో దశ మొదలుకానుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ విజయయాత్రకు సంబంధించిన ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సైతం విడుదల చేయనున్నారు. ఈసారి దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు మీదుగా వారాహి విజయయాత్ర సాగే అవకాశం వుంది.
ఇంట్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన పవన్ దంపతులు :
అన్నా లెజ్‌నేవా- పవన్ కళ్యాణ్ దంపతులు విడిపోతున్నారంటూ మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ .. పుకార్లకు చెక్ పెట్టేలా బుధవారం కొన్ని ఫోటోలు విడుదల చేసింది. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కల్యాణ్ , ఆయన సతీమణి అన్నా లేజ్‌నేవాలు హైదరాబాద్‌లోని తమ నివాసంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments