Pawan Kalyan:ఈ నెల 9 నుంచి వారాహి విజయయాత్ర రెండో విడత .. ఏలూరులో పవన్ భారీ బహిరంగ సభ

  • IndiaGlitz, [Friday,July 07 2023]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. నేతలను, క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు తన బలం ఏంటో చూపించేందుకు ఆయన చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరిగిన సంగతి తెలిసిందే. కత్తిపూడి నుంచి భీమవరం వరకు జరిగిన ఈ యాత్రలో ఆయన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగారు. ఇదే సమయంలో అధికార వైసీపీపై వాడి వేడి విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సభలకు జనం వెల్లువలా తరలివచ్చారు. త్వరలో వారాహి విజయయాత్ర రెండో దశ మొదలవుతుందని భీమవరంలో పవన్ కల్యాణ్ స్ఫష్టం చేశారు.

ఏలూరు సభతో వారాహి యాత్ర ప్రారంభం :

ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో వారాహి విజయయాత్ర రెండో దశ మొదలుకానుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ విజయయాత్రకు సంబంధించిన ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సైతం విడుదల చేయనున్నారు. ఈసారి దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు మీదుగా వారాహి విజయయాత్ర సాగే అవకాశం వుంది.

ఇంట్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన పవన్ దంపతులు :

అన్నా లెజ్‌నేవా- పవన్ కళ్యాణ్ దంపతులు విడిపోతున్నారంటూ మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ .. పుకార్లకు చెక్ పెట్టేలా బుధవారం కొన్ని ఫోటోలు విడుదల చేసింది. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కల్యాణ్ , ఆయన సతీమణి అన్నా లేజ్‌నేవాలు హైదరాబాద్‌లోని తమ నివాసంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

More News

Ram Charan:థ్రెడ్స్‌ యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన రామ్ చరణ్ , యూజర్ ఐడీ ఇదే .. అభిమానులూ మొదలెట్టండి మరి

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు టాప్ స్టార్స్‌ అంతా సోషల్ మీడియాలో చురుగ్గా వుంటున్న సంగతి తెలిసిందే.

VK Naresh:తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్, ఏం జరుగుతోంది..?

ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్

High Court:తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు : ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా

Salaar Teaser : పులి, సింహం డేంజరే.. కానీ జురాసిక్ పార్క్‌లో :  ప్రభాస్ విశ్వరూపం చూశారా, ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘సలార్’’. అప్పుడెప్పుడో ఈ మూవీ నుంచి పోస్టర్లు రిలీజ్ చేయడమే తప్పించి..

Pawan Kalyan:విడాకుల రూమర్స్‌కు చెక్ : భర్తతో అన్నా లెజ్‌నేవా పూజలు, ఒక్క ఫోటోతో అందరికి ఇచ్చిపడేసిన పవన్ కల్యాణ్

నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో