Pawan Kalyan : రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో ములాఖత్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో వున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలవనున్నారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ చేరుకోనున్నారు. తొలుత చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి.. తర్వాత జైల్లో టీడీపీ అధినేతతో పవన్ భేటీ అవుతారని సమాచారం.
పవన్‌ను అనుమతించని ఏపీ పోలీసులు :
అయితే చంద్రబాబు అరెస్ట్‌ను తొలి నుంచి పవన్ కల్యాణ్ ఖండిస్తూ వస్తున్నారు. బాబును అదుపులోకి తీసుకున్న రోజున ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకోవాల్సింది. కానీ ఉద్రిక్త పరిస్ధితులు, శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకుని పవన్ విమానానికి అనుమతించొద్దని కృష్ణాజిల్లా పోలీసులు ఎయిర్‌పోర్ట్ అథారిటీని కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు పవన్ కళ్యాణ్ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలోనే నిలిపివేశారు.
చంద్రబాబుకు మద్ధతు కొనసాగుతుందన్న పవన్ :
దీంతో పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలోనే ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరారు. అయితే తెలంగాణ బోర్డర్‌లోనే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ అర్ధరాత్రి నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు. మరుసటి రోజు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన మద్ధతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ పిలుపునిచ్చిన ఏపీ బంద్‌కు కూడా జనసేనాని సంఘీభావం ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments