రెండు స్థానాల్లో పవన్ పోటీ.. ప్రకటించిన జనసేన
- IndiaGlitz, [Tuesday,March 19 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సేమ్ టూ సేమ్ ‘అన్నయ్య’ రెండు స్థానాల్లో పోటీచేస్తారని ముందుగా లీకులొచ్చాయి. ముందుగా అనుకున్నట్లుగానే పవన్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ పోటీ చేయబోతున్నారు. కాగా.. గాజువాక, తిరుపతి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి.
మంగళవారం ఉదయం జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు ఏ నియోజకవర్గంలో అయితే పోటీకి పరిస్థితులు అనుకూలిస్తాయని నిశితంగా పరిశీలించి ఆలోచించి ఫైనల్‌గా భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాలను ఫిక్స్ చేయడం జరిగింది. చేయాలని సూచించారు. కాగా.. జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపించింది.
అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం అసెంబ్లీ స్థానాలు ఆ సర్వేలో అగ్రస్థానాల్లో నిలిచాయి. దీంతో ఈ అన్నింటికంటే గాజువాక, భీమవరం పరిస్థితులు అనుకూలిస్తాయని పార్టీ పెద్దలు చెప్పడంతో పవన్ కూడా అటే మొగ్గుచూపారు. అయితే నామినేషన్ ఎప్పుడు వేస్తారనే విషయం ఇవాళ సాయంత్రం లేదా రేపు అనగా బుధవారం తేలిపోనుంది.
మొత్తానికి చూస్తే.. గత కొన్ని రోజులుగా అటు అభిమానులు.. ఇటు జనసేన కార్యకర్తల్లో నెలకొన్న టెన్షన్‌కు మంగళవారం మధ్యాహ్నం తెరపడిందన్న మాట. అయితే ఈ రెండు స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏ మేరకు విజయం సాధిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.