Tamil »
Cinema News »
ప్రత్యేక హోదా మీకు ముగిసిన అధ్యాయం కావచ్చు...కానీ జనసేనకు సరికొత్త అధ్యాయం..! జనసేన అధినేత పవన్
ప్రత్యేక హోదా మీకు ముగిసిన అధ్యాయం కావచ్చు...కానీ జనసేనకు సరికొత్త అధ్యాయం..! జనసేన అధినేత పవన్
Thursday, November 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతి, కాకినాడలో బహిరంగ సభలను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు అనంతపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేసారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసారు. ఈ వేదికకు కల్లూరు సుబ్బారావు, మైదానానికి తరిమెల నాగిరెడ్డి ప్రాంగణంగా పేరు పెట్టారు. చనిపోయిన భారతదేశ సైనికుల కోసం మౌనం పాటించిన తర్వాత, మన మాతృభూమికి భారత్ మాతాకీ జై అంటూ జైజైలు చెప్పిన తర్వాత పవన్ ప్రసంగం ప్రారంభించారు.
ఓట్లు అడిగేటప్పుడు ఓ భాష - ఇచ్చేటప్పుడు అర్ధం కాని భాష..!
ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అర్ధమమ్యే భాషలో మాట్లాడతారు. ప్రత్యేక హోదా ఇచ్చే టైమ్ లో మాత్రం అర్దం కాని భాషలో మాట్లాడతారు. ప్రత్యేక హోదా గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ పేపర్స్ లో ఉన్న విషయాల గురించి నిపుణులతో చర్చించిన తర్వాత మీ ముందుకు వచ్చాను. ఈ ప్యాకేజ్ ని పాచిపోయిన లడ్డులు అన్నాను. నేను ప్యాకేజీని అగౌరవ పరచడం కోసం అనలేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు మంచి ప్యాకేజ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా మంచి ప్యాకేజే అన్నారు. పార్లమెంట్ తలుపులు మూసేసి ఓ పద్దతి పాడు లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించ్చు. ప్యాకేజ్ లు అద్భుతాలు అనచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వారు ఉన్నారు. సన్మానాలు చేయించుకున్నారు వారు ఉన్నారు. ఇంకా మాట్లాడితే ముగిసిపోయిన అధ్యాయం అంటారు. రాష్ట్రప్రభుత్వం అండగా ఉన్నమీకు ముగిసిన అధ్యాయం కావచ్చు కానీ కరువులో ఉన్న అనంతపురం కు అమృత చుక్క.
స్పెషల్ స్టేటస్ గురించి చదివి సైట్ వచ్చేసింది..!
టి.డి.పి, బి.జె.పి.కి వంత పాడాను అంటే నిధులు వస్తాయి అనే కారణంతోనే మద్దతు పలికాను. కానీ ఇచ్చిన మాటలు నిలుపుకోనప్పుడు ఖాళీగా ఉండలేను. మమ్మల్ని వంచించారు మోసం చేసారు. దీని నుంచి సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలవుతుంది. స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్దత లేదు ఇవ్వలేదు కూడా. పోలవరం ప్రాజెక్ట్ గురించి, అనంతపురం రాయలసీయ కరువుకు జనసేన ఏం చేయబోతుందో చెబుతాను. స్పెషల్ స్టేటస్ గురించి చదవి సైట్ వచ్చేసింది. గ్రాంట్ ఇవ్వమని కేంద్రాన్ని కోరుకుంటున్నాను. పోలవరానికి వేసిన బడ్జెట్ 16వేల కోట్లు. కేంద్రం ఇచ్చేది 8వేల కోట్లు మాత్రమే. మరి ఏవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయ్యిందో తెలియడం లేదు. దీనికి రాష్ట్రప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది అని అడుగుతున్నాను.
రాయలసీమకు పేజీలపేజీల చరిత్ర ఉంది కానీ నీళ్లు లేవు..!
బిజెపి, రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మాతో ఆడుకోవద్దు..మమ్మల్ని మోసం చేయద్దు.. ఆత్మగౌరవంతో ఆడుకోవద్దు..! అంకెల గారడితో మాటల గారడితో వంచించకండి. అనంతపురం లో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం అన్నారు. ఇప్పుడున్న 14 ఏళ్ల కుర్రాడి మనవడు పుట్టినప్పుడు తెస్తారా..? మాటలు విని విని అలసిపోయాం. మీ ఆత్మకు క్షోభ కలిగించడం... వంచిస్తున్నాం అనిపించలేదు. 2019 ఎన్నికలకు మేము ఏం చేయాలో బాగా తెలుసు. కేంద్ర, రాష్ట్రం గుర్తించాలి అని పదే పదే విజ్ఞిప్తి చేస్తున్నాను. మా ప్రాణాలతో ఆడుకోకండి. నా అనుమతి లేకుండా పుట్టాను. నాకు అందరూ సమానమే. అందరి కోసం పోరాటం చేస్తాను. రాయలసీమకు పేజేలపేజీల చరిత్ర ఉంది. కానీ... తాగడానికి నీళ్లు లేవు. కల్లూరు గారు రాసిన తాకట్టులో భారతదేశం పుస్తకాన్ని మా నాన్న గారు ఇచ్చారు. మన వనరులు మనకు ఉపయోగపడిన తర్వాతే బయటకు వెళ్లాలి. కానీ బయటవాళ్లకు ఉచితంగా ఇచ్చేస్తున్నాం. మనం కొనుకుంటున్నాం. ఆయనే బతికిఉంటే ఎలా రాసేవాళ్లో ఉహించలేం. ప్రజల కోసం పారాటపడిన గొప్పవ్యక్తి.
2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..!
జనసేన పొలిటికల్ ఆఫీస్ హైదరాబాద్ లో పెట్టాను. నా మొదటి జనసేన ఆఫీస్ అనంతపురంలో పెడుతున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తాను లేదో తెలియదు. నాకు ఎవరు అండగా ఉంటారో తెలియదు నేను మాత్రం అందరికీ అండగా ఉంటాను. రాజకీయ నాయకుల శాపం ఉంది. ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రం కోసం నిలబడలేని వాళ్లు ఉన్నారు. జనసేన పార్టీ నేతృత్వంలో మన కరువుని ఢిల్లీ దాకా తీసుకువెళ్లడానిక రెడీగా ఉన్నాను. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. బెంగుళూరు లో రాయలసీమ నుంచి వలసలను చూసాను. ఆడవాళ్ల మీద ఆత్యాచారాలు జరుగుతున్నాయి. నాకు శక్తి ఉండి ఉంటే ఏదైనా చేసేవాడని.నేను రైతుని కూలిపని చేస్తాను. నీళ్లు లేకపోతే చెట్లు చనిపోతే బాధపడేవాడిని. ఈ సమస్యను జాతీయస్ధాయి నాయకులుకు తీసుకువెళతాను. ప్రధాని గార్కి మిగిలిన నాయకులకు చెబుతాను. రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ది ఉంటే అనంతపురం కోసం చేసింది.
సత్యసాయిబాబా రావాలా..?
రాయలసీమ అవసరాలు తీర్చడానికి సత్యసాయిబాబా రావాలా..? మన కరువు చూసి జపనీస్, పాలేకర్ వచ్చి ఎంతో కొంతో అవసరమైన పనులు చేపట్టారు. వ్యక్తులు చేయగలిగినప్పుడు వ్యవస్థ ఎందుకు చేయలేదు. అందుకనే రాయలసీమకు కరువు దుర్బిక్షం. నటుడుగా నాకు ఆనందం లేదు. నిజమైన ఆనందం ప్రజలకు అండగా నిలబడినప్పుడు..! రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు కానీ అండగా ఉంటాను. ఎవరెవరో వచ్చారు ఏం చేసారో తెలియదు కానీ రాయలసీమ బిడ్డగా రకరకాల సమూహాలతో చర్చించాను. నేను మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మాట్లాడడం లేదు. గుండెలోతుల్లోంచి మాట్లాడుతున్నాను. వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయాన్ని అనంతపురంలో ప్రారంభిస్తాను. ఏ పార్టీ మీద వ్యతిరేకత లేదు. లోపాలు ఉన్న ప్యాకేజ్ ని ఎందుకు ఆమోదించారు. మనకు రావాల్సిందే ఇచ్చినపు ఏవిధంగా మెచ్చుకుంటారు..? దీనికి సమాధానం చెప్పాలి.
బాబు, జగన్ మాయమాటలు చెబితే చాలా బలమైన శత్రువుని..!
నేను మాట్లాడింది కొన్నిసార్లు చంద్రబాబుగార్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అంటారు. రాజకీయం అంటే ఏమిటో కల్లూరి గారి అడగండి. జనసేన తిట్టే రాజకీయం చేయదు. జనసేన విధానం పై పోరాటం చేస్తుంది వ్యక్తుల పై కాదు. బాబు, జగన్ శత్రువులు కాదు. పాలసీ విధానాల్లో విభేదాలే తప్ప శత్రుత్వుం లేదు. కానీ..ప్రజలకు నిలడనప్పుడు మాయమాటలు చెబితే శత్రేవునే... చాలా బలమైన శత్రువుని. నాకు పదవులు డబ్బులు అవసరం లేదు. ప్రజల సమ్యసలు పరిష్కరించాలి. దశబ్దాలదోపిడి వలన అలసిపోయాం. విసుగువచ్చింది. నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను. నా కోసం కాదు. నేను చేతులు కట్టుకుంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నాకు అందరూ శత్రవులు అయిపోయారు.ఒక జనరేషన్ చేసిన తప్పులుకి ఇబ్బంది పడుతున్నాం. సరిదిద్దకపోతే భావితరం దెబ్బతింటుంది. ఆడబిడ్డల కన్నీరు పెట్టకూడదు. రైతు కన్నీరు పెట్టకూడదు. రైతు అన్నం పెట్టేవాడు. రైతును మనం చంపుకుంటున్నాం. అన్నదాత కోసం ప్రాణాలు అర్పిస్తాను. ప్రతి ఒక్కరిలో రైతు ఉండాలి సైనికుడు ఉండాలి.
తెలుగుదేశంలో రాజకీయ అవినీతి ఎక్కువైంది..!
తెలుగుదేశంలో రాజకీయ అవినీతి ఎక్కువైంది అనే మాట బయట వినపడుతుంది. నేను కులం అడ్డుగోడలు దాటి మీకు మద్దుతు పలికాను. ఒక కులానికి మతానికి కాకుండా అందరిని సమానంగా చూడండి. ఆత్మపరిశీలన చేసుకోండి. రాయలసీమ నాయకులకు ప్రజలకు అమరావతి దూరంగా ఉంది అనిపిస్తుంది. ఉత్తారంధ్రకు అమరావతి దూరంగా ఉంది. అందుచేత ఏర్పాటువాద ఆలోచనలు ఉన్నాయి. రెండుగా విడిపోయే ప్రమాదం ఉంది చూసుకోండి. రాజధాని కోసం అన్ని ప్రాంతాల్లో మట్టి తీసుకువచ్చారు. అలాగే రాజధానిని అందరి రాజధానిగా చేయండి. అలా చేయకపోతే ఉద్యమాలు వస్తాయి. డబ్బుతో రాజకీయాలు అంటే చిరాకు. సినిమాల్లో పోరాటం సులువు. నిజ జీవితంలో దశాబ్దలు పడుతుంది. నిరంతం పోరాటం చేయడానికి జనసేన ఎప్పుడూ ముందు ఉంటుంది.
సింగపూర్ తరహా కట్టడాలు కాదు...ఆ తరహా పరిపాలన కావాలి..!
అనంతపురం తరుచూగా వస్తుంటాను. పార్టీ నిర్మాణం అనంతపురంనుంచే ప్రారంభిస్తాను. సామాజిక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. పవర్ వచ్చినా రాకపోయినా పోరాటం చేస్తాను. మీ ఇంట్లో ఒక్కడిగా అండగా ఉంటాను. దేశంలోనే కరువు ప్రాంతంగా అనంతపురం మిగిలిపోయింది. మార్పు కోసం ఇక్కడ నుంచే శ్రీకారం చుడతాను. జనసేన సరికొత్త రాజకీయ వ్యవస్థ. ఏ వర్గలనైతే, ఏ కులాలనైతే వెనకు నెట్టేసారో..వాళ్లందరికీ అండగా ఉంటాను. సింగపూర్ లా కట్టడాలు కడితే కాదు...సింగపూర్ తరహా కఠినమైన పరిపాలన చేస్తే బాగుంటుంది. సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రధాని అపాయమెంట్ అడిగాను ఇవ్వలేదు. అందరూ ఒకటే మాటమీదు ఉండాలి. అనంతపూర్ దుర్భిక్ష కోరల నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచించిండి. చంద్రబాబు గారు, జగన్ అనంతపురం కరవును అరికట్టేందుకు ఏం చేసినా నా మద్దతు ఉంటుంది. రాజకీయ నాయకుల్లో అవినీతి పోతేనే వ్యవస్ధ బాగుపడుతుంది అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలియచేసారు...!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments