మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి జనం బయటపడాలి: ఏపీ ప్రజలకు పవన్ దీవాళీ శుభాకాంక్షలు
Send us your feedback to audioarticles@vaarta.com
సామాజిక-ఆర్థిక విధాన నిర్ణయాలపై అమెరికన్ ఆర్థికవేత్త, సామాజిక సిద్ధాంతకర్త థామస్ పోవెల్ చేసిన పోస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తాను వ్యక్తిగతంగా ఎకనామిస్ట్ & సోషల్ థియరిస్ట్ థామస్ సోవెల్ను అభినందిస్తున్నాను. ఆయన రచనలను తిరిగి చదువుతూ ఉంటాను. థామస్ పరిశీలనలు చాలా నిజం & అతని లోతైన విశ్లేషణాత్మక పదాలు, 'వాట్ వర్క్స్ & వాట్ సౌండ్స్ గుడ్' . ఆయన సూచించిన సామాజిక-ఆర్థిక విధాన నిర్ణయాలు ఏపీకి కూడా వర్తిస్తాయి అంటూ పవన్ ట్వీట్ చేశారు.
మరోవైపు పవన్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలు భయటపడాలని.. దీపావళి పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నా అన్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని.. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తామన్నారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన తన తరపున, తన పార్టీ జనసేన తరపున పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందాం. ఎక్కువ లహానికరం కానీ మందుగుండు సామాగ్రితో దీపావళి జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరమన్నారు జనసేనాని. ఈ దీపావళిని ఆనందకేళిగా మలుచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout