Pawan Kalyan:వైసీపీలో అంతా క్రిమినల్సే.. మళ్లీ జగన్ గెలిచాడో, ఏపీ సర్వనాశనమే : పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Monday,June 19 2023]

కులాన్ని అడ్డు పెట్టుకొని నాయకులు ఎదుగుతున్నారని.. వారే పెద్దవాళ్లు అవుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే దళిత డ్రైవర్ ను చంపి, ఇంటికి పార్శిల్ పంపితే దళిత సంఘాల నాయకులకు ఎందుకు కోపం రాదని పవన్ ప్రశ్నించారు. తన అక్కను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నిస్తే, ఆ బాలుడ్ని పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేసినా బీసీ సంఘాల నాయకులకు కోపం ఎందుకు రాదని ఆయన నిలదీశారు. పెట్రోలు పోసి తగులబెట్టిన బాలుడి ప్రాణానికి రూ.లక్ష విలువ కట్టి బేరం ఆడిన బీసీ నాయకుడా మనల్ని పాలించేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. చిన్న చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతిన్నాయని బయటకు వచ్చే నాయకులు, వారి వారి కులాలకు చెందిన వారిని హత్య చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.

ఏపీలో బీహార్‌ను మించిన పరిస్థితులు :

క్రిమినల్స్‌తో నిండిపోయిన వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం కలుగుతుందని 2014 లోనే చెప్పానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. రౌడీయిజం, గుండాయిజం, దోపిడీ, లూటీ, కబ్జా, అవినీతిలకు మూలంగా మారిపోయిన ఈ ప్రభుత్వంలో నేరం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఎదురు తిరుగుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. అడుగడుగునా అవినీతి, మహిళల అక్రమ రవాణా, గంజాయి మత్తు, ఇసుక దోపిడీ, స్థలాల కబ్జా ఇలా ప్రతి విషయంలోనూ సామాన్యులు పడుతున్న వేదనలు నిత్యం చూస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

మంగళగిరిలోనే వుంటా :

కులాల వారీగా యువతను విడదీస్తేనే వారికి అధికారమని, అందుకే యువతలో ఐక్యత ఉండకుండా రకరకాల పన్నాగాలు పన్నుతారని జనసేనాని గుర్తుచేశారు. నేరం చేసిన వాడు ఏ కులమైతే మనకేంటీ ని పవన్ ప్రశ్నించారు. బాపట్లలో 14 ఏళ్ల బాలుడు తన అక్కను వేధిస్తున్నాడని వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తిని నిలదీస్తే, ఆ వెంకటేశ్వరరెడ్డి ఆ బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టాడని మండిపడ్డారు. అప్పుడు కులం ఎందుకు గుర్తుకొస్తుంది, తప్పు ఎవరు చేసినా ఒక్కటేనని పవన్ స్పష్టం చేశారు. నేరం చేసిన వాడు ఏ కులమైనా వదిలేది లేదని.. రాష్ట్రంలో క్షేమం, భద్రత ఉండాలని బలంగా జనసేన పార్టీ కోరుకుంటుందన్నారు. యువతలో భయం పోవాలని.. తప్పు చేసిన వారిని ఎదిరించే ధైర్యం రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాను మంగళగిరిలోనే వుంటానని.. మీ ప్రతి కష్టంలో తోడుగా నిలబడతానని స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్ల కోసం గంటల తరబడి క్యూ లో నిలబడే యువతరం పోలింగ్ బూత్ వద్ద నిలబడలేకపోతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మన బతుకులను ఐదేళ్ల పాటు ప్రభావితం చేసే నాయకులను ఎన్నుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

అనుకోకుండా రేప్ చేశారట :

కడపలో 15 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారం చేసి గర్భవతిని చేస్తే అధికారులు పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్లలో ఫార్మసీ విద్యార్థి తేజస్విని అత్యాచారం చేసి చంపేసిన నిందితులను పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వారం రోజుల కింద నెల్లూరులో 22 ఏళ్ల యువతని హత్య చేశారని.. రేపల్లెలో భర్తను కొట్టి ఆడబిడ్డపై గ్యాంగ్ రేప్ చేశారని గుర్తుచేశారు. దొంగతనానికి వచ్చి, అనుకోకుండా రేప్ చేశారని మహిళా హోంమంత్రి చెబుతున్నారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. గతంలో బిహార్ వంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కంటే ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయిని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

More News

Pawan:వాళ్ల తాతకు డీటీ నాయక్ బేడీలు.. ఈ డెకాయిట్‌కి భీమ్లా నాయక్ ట్రీట్‌‌మెంట్ ఇస్తా : ద్వారంపూడికి పవన్ వార్నింగ్

వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది. దీనిలో భాగంగా ఆదివారం కాకినాడ సర్పవరం కూడలిలో

Gandhi Hospital Superintendent:రాకేష్ మాస్టర్ కన్నుమూత ..ఆయన మరణానికి కారణమిదే : గాంధీ సూపరింటెండెంట్ ఏమన్నారంటే

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం చెందడంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

Mission Tashafi:జీ 5 లో హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘మిషన్ తషాఫి’ షూటింగ్ ప్రారంభం

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5.

Rakesh Master : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇకలేరు.

Harassing girls:అమ్మాయిలతో ఏకాంతంగా .. ఫోటోలు, వీడియోలు తీసి వేధింపులు,  కర్ణాటకలో కీచకుడు అరెస్ట్

కర్ణాటకలోని శివమొగ్గలో ఫోటోలు, వీడియోలతో వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ జీ.కే మిథున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..