Janasena Party : కౌలు రైతు భరోసా యాత్ర.. తూ.గో జిల్లాలో రైతు కుటుంబానికి పవన్ పరామర్శ, ఆర్ధిక సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. దీనిలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, పొట్టిలంకలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు పచ్చిమళ్ల శంకరం కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతరం శంకరం మృతికి గల కారణాలను కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్నారు. పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఆయన భార్యగౌరికి పవన్ కల్యాణ్ అందచేశారు. శంకరం కుటుంబానికి జనసేన తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పవన్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం:
అంతకుముందు శనివారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వీర మహిళలు, జనసైనికుల రాకతో మధురపూడి విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అభిమానులు పోటెత్తారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు.
#GoodMorningCMSir క్యాంపెయిన్‌కు మంచి రెస్పాన్స్:
ఇకపోతే... ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల దుస్ధితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేల్కొలుపుతామంటూ #GoodMorningCMSir పేరిట జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి గుంతలు పడిన ఫోటోలు, వీడియోలను ప్రజలు, జనసేన నేతలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments