Renu Desai :పవన్ డబ్బు మనిషి కాదు.. మధ్యలో పెళ్లిళ్లు , పిల్లలు ఎందుకు : జగన్ బ్యాచ్‌ని చాచికొట్టేలా రేణూ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఇటీవలికాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఏకంగా ముఖ్యమంత్రి సైతం స్టేజ్‌పై మాట్లాడటం తెలిసిందే. దీనికి జనసేన నుంచి అదే స్థాయిలో కౌంటర్‌లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి షాకిచ్చేలా పోస్ట్ పెట్టారు పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్. పవన్ డబ్బు మనిషి కాదని.. పేదల సంక్షేమంతో పాటు సమాజానికి మంచి చేయాలని భావిస్తారని ఆమె కొనియాడారు. పవన్ కల్యాణ్ చాలా అరుదైన వ్యక్తి అని.. ఆయనకే తన మద్ధతు వుంటుందని క్లారిటీ ఇచ్చారు.
నా మద్ధతు పవన్‌కే :
తొలి రోజు నుంచి నేటి వరకు పవన్‌ను రాజకీయంగా తాను సపోర్ట్ చేస్తూనే వున్నానని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. తామిద్దరం విడిపోయి 11 ఏళ్లు గడిచిందని.. తనకు తెలిసినంత వరకు పవన్ డబ్బు మనిషి కాదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల వరకు తన మద్ధతు ఆయనకేనని.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీని సైతం పక్కనబెట్టి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని రేణూ దేశాయ్ ప్రశంసించారు. పవన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు మూడు పెళ్లిళ్లపై చర్చను ఆపాలని ఆమె కోరారు. తన పిల్లలనే కాదు.. ఆయన మరో ఇద్దరు పిల్లలను కూడా రాజకీయాల్లోకి లాగొద్దని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు.
బ్రో వివాదంపైనా కీలక వ్యాఖ్యలు :
ఇక ఇదే వీడియోలో బ్రో సినిమాలోని శ్యాంబాబు క్యారెక్టర్ పైనా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం గురించి తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. పవన్ పై సినిమా, వెబ్ సిరీస్ తీస్తామని కొందరు అంటున్నారని.. కానీ తాను చెప్పేది ఒకటే, కారణాలు ఎలాంటివైనా దయచేసి ఈ వివాదంలోకి పిల్లలను లాగొద్దని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout