సింహపురి చేరిన జనసేనాని పోరాట యాత్ర
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం వరకు వివిధ వర్గాలతో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో పవన్‌కళ్యాణ్ పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జనసేన శ్రేణులు భారీ ర్యాలీగా వెంటరాగా గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పుత్తూరు, శ్రీకాళహస్తి మీదుగా నెల్లూరు జిల్లాకి పయనమయ్యారు. పవన్ వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు బాణసంచా పేలుళ్లు, హారతులతో ఆయనకి ఆహ్వానం పలికారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని అదుపు చేయడం ఒక దశలో సెక్యూరిటీ సిబ్బందికి సైతం ఇబ్బందిగా మారింది.
అభిమానులు ప్రేమతో తన కోసం తీసుకు వచ్చిన పూలదండల్ని, ఎర్రకండువాలని స్వీకరించారు. ఓ అభిమాని జనసేన సింబల్‌తో డిజైన్ చేసిన గొడుగుని పవన్‌కు బహూకరించగా.. ఆయన దాన్ని వెంటనే వేసుకున్నారు. తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపి ముందుకి సాగారు. పుత్తూరు-శ్రీకాళహస్తి మధ్య కూడా పలు గ్రామాల ప్రజలు ఆయన్ని చూసేందుకు రోడ్ల మీదికి వచ్చారు. వాహనశ్రేణి పైకి వచ్చి తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకి సాగారు. చిత్తూరు నుంచి నెల్లూరు జిల్లాకి చేరుకోవడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. పోరాటయాత్ర కోసం సింహపురికి విచ్చేస్తున్న పవన్‌కు నాయుడుపేటలో నెల్లూరు జిల్లా వాసులు ఘనస్వాగతం పలికారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments