సింహ‌పురి చేరిన జ‌న‌సేనాని పోరాట యాత్ర

  • IndiaGlitz, [Monday,March 04 2019]

జ‌న‌సేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా ప‌ర్యట‌న ముగించుకున్న ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు ప‌ర్యట‌న‌లో భాగంగా ఆదివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వివిధ వ‌ర్గాల‌తో నిర్వహించిన పార్టీ స‌మావేశాల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల ప్రాంతంలో జ‌న‌సేన శ్రేణులు భారీ ర్యాలీగా వెంట‌రాగా గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పుత్తూరు, శ్రీకాళ‌హ‌స్తి మీదుగా నెల్లూరు జిల్లాకి ప‌య‌న‌మ‌య్యారు. పవన్ వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు బాణ‌సంచా పేలుళ్లు, హార‌తుల‌తో ఆయ‌న‌కి ఆహ్వానం ప‌లికారు. భారీగా తరలివచ్చిన జ‌న‌సందోహాన్ని అదుపు చేయ‌డం ఒక ద‌శ‌లో సెక్యూరిటీ సిబ్బందికి సైతం ఇబ్బందిగా మారింది.

అభిమానులు ప్రేమ‌తో త‌న కోసం తీసుకు వ‌చ్చిన పూల‌దండ‌ల్ని, ఎర్రకండువాల‌ని స్వీక‌రించారు. ఓ అభిమాని జ‌న‌సేన సింబ‌ల్‌తో డిజైన్ చేసిన గొడుగుని ప‌వ‌న్‌కు బ‌హూక‌రించ‌గా.. ఆయ‌న దాన్ని వెంట‌నే వేసుకున్నారు. త‌న కోసం త‌ర‌లివ‌చ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధ‌న్యవాదాలు తెలిపి ముందుకి సాగారు. పుత్తూరు-శ్రీకాళ‌హ‌స్తి మ‌ధ్య కూడా ప‌లు గ్రామాల ప్రజ‌లు ఆయ‌న్ని చూసేందుకు రోడ్ల మీదికి వ‌చ్చారు. వాహ‌న‌శ్రేణి పైకి వ‌చ్చి త‌న కోసం వ‌చ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకి సాగారు. చిత్తూరు నుంచి నెల్లూరు జిల్లాకి చేరుకోవ‌డానికి సుమారు ఐదు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. పోరాట‌యాత్ర కోసం సింహ‌పురికి విచ్చేస్తున్న పవన్‌కు నాయుడుపేట‌లో నెల్లూరు జిల్లా వాసులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

More News

బ్రేకింగ్: మసూద్ అజర్ ఖతం హోగయా..!?

అవును మీరు వింటున్నది నిజమే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ ఖతం హోగయా..!?

సంచలనం: ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు.. ఆయనే సీఎం

తెలంగాణలో పూర్తిగా గాలిపోయిన ‘సైకిల్’కు పంచర్లు వేసి నడిపేందుకు అధిష్టానం సిద్ధమైందా..?

అభినందన్‌‌‌కు జరిపిన‌‌‌ వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే...

పాక్ చెరనుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్, రియల్ హీరో అభినందన్‌‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాములమ్మ పోరాటం

2018 ముందస్తు ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌‌లోకి వలసలు ఆగట్లేదు.

మార్చి 8న 'స‌ర్వం తాళ‌మ‌యం'

జి.వి.ప్ర‌కాష్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించిన చిత్రం `స‌ర్వం తాళ‌మ‌యం`. రాజీవ్ మీన‌న్ తెరకెక్కించారు.