Pawan Kalyan: ఈనెల 27న అమిత్‌ షాతో పవన్ కల్యాణ్‌ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. ఎన్నికల్లో కలిసి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే జనసేన పార్టీతో పొత్తుకు మొగ్గు చూపుతుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సీట్లుపై చర్చించారని.. తమకు కనీసం 30 సీట్లు కావాలని పవన్ అడిగారు. అయితే బీజేపీ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇటీవల 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 27న సూర్యాపేటలో జరిగే ప్రచార సభలో పాల్గొనేందుకు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ సమయంలో ఇరువురు నేతలు భేటీ అయి సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉంది. గురించి చర్చించనున్నారు. తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కాబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

కానీ ఇక ఈ ఎన్నికల్లో మాత్రం 32కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఏయే నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే జాబితాను కూడా ఇప్పటికే విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా సీట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే జనసేనకు 12 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

More News

Medigadda Barrage: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని పరిశీలించిన కేంద్ర బృందం

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Srilanka: శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక ఆ అవసరం లేదు..

శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండానే తమ దేశం రావొచ్చని ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana TDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉందనే ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కుట్ర ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Mega156: మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దసరా పండుగ ట్రీట్ ఇచ్చారు. 156వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది.

Mallareddy: గత స్మృతులు గుర్తుచేసుకుంటూ 40ఏళ్ల నాటి స్కూటర్‌పై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. విజయదశమి సందర్భంగా ఆయన తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.