Janasena Party : జనసేనను గెలిపించాలి.. జగన్ రెడ్డిని ఓడించాలి, ఇదే మన నినాదం: వీర మహిళలతో నాదెండ్ల

జనసేనను గెలిపించాలి.. జగన్ రెడ్డిని ఓడించాలి అనే నినాదంతో ప్రతి వీర మహిళా రాబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల మహిళా క్రియాశీలక సభ్యుల రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రజా విజయాన్ని కాంక్షిస్తున్నారనీ, జనసేన విజయమే ప్రజా విజయం కావాలన్నారు.

వైసీపీ దౌర్జన్యాలను ప్రజలకు వివరించండి:

ప్రజల పక్షాన నిలిచినప్పుడే అది సాధ్యపడుతుందని.. రాజకీయాల్లో రాణించాలి అంటే సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. వైసీపీ దౌర్జన్యాలు, మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ పార్టీ ఉద్దేశాలు, ప్రణాళికలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలి అనే అంశాలపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని నాదెండ్ల తెలిపారు.

జగన్ కుట్రలకు వ్యతిరేకంగా వీర మహిళలే నిలబడ్డారు:

భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకుందామని.. రూ.500 రుసుము చెల్లించి మూడున్నర లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించారని మనోహర్ వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీకీ ఈ విధమైన సభ్యులు లేరని... ఈ సారి ఎక్కువ మంది వీర మహిళలు సభ్యత్వం స్వీకరించారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ రెడ్డి యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఏకగ్రీవాలు చేయాలని ప్రయత్నించారని మనోహర్ ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చాలా ప్రాంతాల్లో వీర మహిళలే పార్టీ కోసం నిలబడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు.

మనం ఐక్యంపై పనిచేస్తే... ఏ కుట్రలు పనిచేయవు:

పవన్ కళ్యాణ్ పై ప్రజలకు ఉన్నంత అభిమానం, నమ్మకం రాష్ట్రంలో మరే నాయకుడి మీద లేదని నాదెండ్ల స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని మరింత బలపడే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్రియాశీలక సభ్యులుగా ఒక్కోక్కరు కనీసం 100 మందిని ప్రభావితం చేయాలని.. అధ్యయనం చేసిన అంశాలు క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన పార్టీ లో మరింత మంది‌ చేరేలా ప్రజల్లో చైతన్యం తేవాలని.. వీర మహిళలంతా ప్రజా సేవ కోసం, పార్టీ బలోపేతం కోసం పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మీరు చేసే అన్ని కార్యక్రమాలకు పార్టీ అండగా ఉంటుందని.. పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, అభాండాలు వేసినా మీరు పట్టించుకోవద్దని, ఐక్యంగా పని చేస్తే ఎవరెన్ని కుట్రలు చేసినా చెల్లవని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

More News

Janasena :  సమస్యలు వినే తీరిక జగన్‌కి లేదు.. అందుకే ‘‘జనవాణి’’, జనానికి మేమున్నాం: నాదెండ్ల

జనసేన బలం ఏంటో చూపించాల్సింది వీర మహిళలేనన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

హోటల్‌లో నరేశ్-పవిత్రా.. పట్టుకున్న మూడో భార్య, పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నాలుగో పెళ్లి వ్యవహారంపై గత కొన్నిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Director Ritesh Rana: 'హ్యాపీ బర్త్ డే'లో డిఫరెంట్ కామెడీతో పాటు సరికొత్త ప్రపంచం చూస్తారు: దర్శకుడు రితేష్ రానా

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్ టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై

VK Naresh : పవిత్ర లోకేశ్‌తో పెళ్లి.. ఆ రూమర్స్ అంతా రమ్య పనే, డబ్బు కోసమే అంతా: నరేశ్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Modi Hyderabad Visit: రేపు హైదరాబాద్‌కు మోడీ.. రెండు రోజుల పాటు ఇక్కడే, షెడ్యూల్ ఇదే

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ కు రానున్నారు.