కొత్తపార్టీ పెడతున్నా.. : జనసేన కీలకనేత
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన కీలక నేత, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కొత్త పార్టీ పెడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తెలుగు వారి కోసం తాను ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కీలక ప్రకటన చేశారు. ఆరు నెలల పాటు తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని, ఇక్కడి తెలుగు సంఘాలను ఏకం చేస్తానని వెల్లడించారు. జనసేనలో కీలక నేతగా ఉన్న ఆయన పార్టీని బలోపేతం చేస్తానని చెప్పాల్సిందిపోయి.. మరో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈయన చేసిన ఆ వ్యాఖ్యలు ఇటు ఏపీలో.. అటు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 2021 ఎన్నికల్లో తమిళనాడులోని తెలుగు వారు రాజకీయ శక్తిగా ఎదగాలని రామ్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రజనీ, కమల్‌తో అయోమయం!
అంతటితో ఆగని రామ్మోహన్ రావు.. రజనీకాంత్, కమల హాసన్‌లపై కూడా కామెంట్ చేశారు. ఆ ఇద్దరూ ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారని వ్యాఖ్యానించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయరంగ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా రెండ్రోజుల క్రితం ఎన్నికల వ్యూహకర్త.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్యలో విజయ్ కూర్చొని ఉన్నట్లున్న బ్యానర్స్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్మోహన్ రావు వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
పవన్ రియాక్షన్ ఏంటో!
2019 ఎన్నికలకు ముందు పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్న ఆయన్ను తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. రామ్మోహన్ రావుకు పబ్లిక్ పాలసీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉండటంతో పాటు.. జయలలిత ఆసుపత్రిలో ఉండగా, రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని నడిపారన్న నమ్మకంతో ఆయనకు కీలక బాధ్యతలను పవన్ అప్పగించారు. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా పార్టీ అంటే పవన్ ఏమంటారో..? ఎలాంటి రియాక్షన్ ఉంటుందో మరి. వాస్తవానికి ఇప్పటికే దాదాపు జనసేన పార్టీ ఖాళీ అయిపోవచ్చింది. ఈ క్రమంలో పవన్ బలోపేతం కోసం ఏం చేస్తాడో ఏంటో మరి.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments