Pawan kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. జనసేన వినూత్నం, ఐదు సేవా కార్యక్రమాలకు పిలుపు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత , సినీనటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజంటే అభిమానులకు పండుగ రోజు. పవన్ అన్న పేరే ప్రభంజనం, పవన్ వెంటే మహాజనం, పవన్ అంటే అభిమానులకు ప్రాణం. మరి అంతటి స్టార్‌డమ్ కలిగిన వ్యక్తి బర్త్ డే వేడుకలు సాధారణంగా జరుగుతాయా. ఆ రోజున వూరు వాడా రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ఈసారి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవార జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పీఏసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాలు, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, నగర అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పవన్ జన్మదినోత్సవం ఒకే రోజు .. ఒకే సమయంలో నిర్వహిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 2న మంగళగిరి జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం:
సెప్టెంబర్ 2వ తేదీ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగే మెగా రక్తదాన శిబిరంలో తాను స్వయంగా పాల్గొంటానని మనోహర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ఐదు అంశాలతో కూడిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి జనసైనికుడు, వీర మహిళ పాలు పంచుకోవాలన్నారు. పవన్ రాజకీయ ప్రయాణంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఈ కార్యక్రమాలను రూపొందించామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు, రెల్లి కాలనీల సందర్శన, రెల్లి సోదరులకు నూతన వస్త్రాలు, భోజన ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహణ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సందర్శించి విద్యార్ధులకు పుస్తకాలు, స్టేషనరీ అందించడం, దివ్యాంగులకు సాయం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
కార్యక్రమం వీడియోలు, ఫోటోలతో క్యాంపెయిన్ :
ఈ ఐదు కార్యక్రమాలు పవన్‌కు ఎంతో ఇష్టమైనవన్నారు. బైకు ర్యాలీలు, కేక్ కటింగ్‌లకు సమయం వృథా చేయొద్దని నాదెండ్ల సూచించారు. ఈ ఐదు అంశాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ సంతోషిస్తారని , ఈ కార్యక్రమాలు పది మందికి తెలిసేలా ముందుకు తీసుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు . ఈ కార్యక్రమాల వివరాలను వీడియోలు, ఫోటోలు రూపంలో కేంద్ర కార్యాలయానికి పంపాలని.. అలాగే ఓ స్పెషల్ హ్యాష్‌ట్యాగ్ ద్వారా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిద్దామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout